Ad Code

Responsive Advertisement

శ్రీ రామనవమికి మీరు చెయ్య వలసినది

శ్రీ రామనవమికి మీరు చెయ్య వలసినది

పండగ పూట పరమాన్నం, పిండివంటలు గొంతు వరకూ మెక్కి,పట్టు గుడ్డలు కట్టి, ఆడంబరంగా గుడికి పోయి పది మందికి గొప్పతనాన్ని ప్రదర్శిస్తే వచ్చేది పేద హిందువుల కడుపు మండిన కంటి నుండీ శాపాలూ తప్ప పుణ్యం రాదు. శ్రీరాముడు అడవుల్లో తిరిగాడు, ఆడంబరాలను కాలి గోటితో సమానంగా చూశాడు.

ఆకలితో కడుపు మండుతున్న పేద హిందువులను నిర్లక్ష్యం చేసి మనం మాత్రమే ఆడంబరంగా పండగ చేసుకుని, వాళ్ళ ముందు మన గొప్పతనాన్ని ప్రదర్శించే దురలవాటు వల్లే వాళ్ళు పది కేజీల బియ్యం బ్యాగ్ కూ, వెయ్యి రూపాయల నోటుకూ మతం మారిపోవడం, సెక్యులర్ పార్టీలకు ఓట్లు వేయడం చేస్తున్నారు.

ప్రతీ పండగకూ ముందు మీ చుట్టుపక్కల నివసించే నిరుపేద హిందువులకు సగౌరవంగా మీ ఇంటికి పిలిచి పండగ చేసుకోవడానికి కావలసిన వంట సరుకు, పూజా ద్రవ్యాలు, కొత్త గుడ్డలు దేవుడి పేరు మీద సమర్పించి పేద హిందువు ఇంకా మతం మారకుండా ఉన్నందుకు మీ వంతు సత్కారం చేశాను అని చెప్పడాన్ని మించిన పుణ్యం మరొకటి లేదు..

మనం మాత్రమే పిండి వంటలు చేసుకుని పండగ నుకుంటే ధర్మానికి పైసా ఉపయోగం లేదు. పక్కింటి పేద హిందువును కూడా పండగ చేసుకునేందుకు సహకరించి, పండగ సరుకు, పూజా ద్రవ్యాలు ఇచ్చి పేదవానిలో పరమాత్మను చూసి నమస్కరిస్తే అంతకు మించిన ధర్మాచరణ, ధర్మ రక్షణ ఇంకేదీ లేదు.

పరమ కారుణ్యమూర్తి ఐన శ్రీరాముని పండగ రోజు మీ పక్కింటి పేద హిందువు కనీసం కడుపుకు అన్నం తిన్నాడో లేదో చూడకుండా, మీరు చేసుకునే పండగలో పేద హిందువులకు కూడా కనీసం లో కనీసం పండగ సరుకు ఇచ్చి, అతని ఇంటిలో కూడా పరమాత్ముని పటం ముందు దీపం వెలిగేలా చేయని మీ పండగ పబ్బం కేవలం ఆడంబర ప్రదర్శన తప్ప పుణ్య కారకం, ధర్మ ప్రోత్సహకం కాదు.

లబ్ డబ్ లబ్ డబ్ అంటూ కొట్టుకునే గుండెలో వాసు దేవుడు ఉన్నాడు. మీ కింటికి కనిపించే ప్రతీ పేద హిందువును మించి రాణా ప్రతాప్ సింహా, ఛత్రపతి శివాజీలు ఎవరూ లేరు. నిరుపేదగా కష్టాలు పడుతూ కూడా ఇంకా హిందువుగా జీవిస్తున్నందుకు ప్రతీ పేద హిందువుకూ మనం ఎంతో ఋణపడి ఉన్నాము.

పేద హిందువులు పేదరికంలో కూడా ఇంకా ప్రలోభాలకూ , మతోన్మాదుల దాడులకూ లొంగిపోకుండా స్వధర్మంలో ఉన్నందుకు మనం వారికి ఎంతో ఋణపడి ఉన్నాం. ప్రతీ పండగకూ వారు కూడా తమ ఇంటిలో పండగ చేసుకోవడానికి వంట సరుకును, పూజా సామాగ్రిని సమర్పించుకుని వారి ఋణాన్ని మనం అంతో ఇంతో తీర్చుకోవాలి.

హిందువే హిందువును పీక్కుతినే ఈ కాలంలో నిరు పేదరికంలో కూడా ఇంకా హిందువుగా ఉండి, మతం మారనందుకు నా దృష్టిలో ప్రతీ నిరుపేద హిందువూ ఒక ఛత్రపతి శివాజీనే. పేద హిందూ మహారాజే.

Post a Comment

0 Comments