మీకు తెలుసా? దీపావళి' ప్రప్రధమముగా జరుపుకున్న స్థలము
మీకు తెలుసా? దీపావళి' ప్రప్రధమముగా జరుపుకున్న స్థలము ఇది ఆంధ్రదేశము లో కలదు విజయవాడ నుంచి, అవనిగడ్డ వెళ్ళే కృష్ణానది కరకట్ట మీదుగా సుమారు 50 కి.మీ దూరం వెళితే, 'నడకుదురు' గ్రామము కలదు
ఆ గ్రామమునకు గల పురాతనమైన పేరు "నరకాసుర సంహార క్షేత్రము". ఆ గ్రామము పేరు, కాలక్రమేణా మారుతూ, నరకొత్తూరు, తర్వాత 'నడకుదురు గా మారింది.
ఇక్కడ, మహా సుందరమైన పచ్చని అరటి తోటల మధ్యన, "శ్రీ పృథ్వీశ్వరాలయముంది". సత్యభామా దేవి సాక్షాత్తు భూదేవి. నరకాసురుని సంహరించిన తర్వాత, అమ్మవారు ఈశ్వర ప్రతిష్ట చేసిందని స్థల పురాణము. పృథ్వి' అంటే భూదేవి, సత్యభామ.
ఆ ఆలయము వద్దనే, శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహము కూడా వున్నది. నరకాసురుని ఇచ్చట సంహరించిన తర్వాత, మొట్ట మొదటగా నరక చతుర్దశి, దీపావళి జరుపుకున్నారు.
నరకాసురుడు, స్వర్గలోకమునుంచి తెచ్చి 'పాటలీవృక్షమును' ఈ ఆలయము వద్ద నాటాడు. మన భారతదేశంలోనే గల ఏకైక వృక్షమిది. 5000 సంవత్సరములనాటిది. ఈ వృక్షమును ఇప్పటికీ మనము దర్శించుకోవచ్చు.
బిడ్డలు లేని వారు, ఈ చెట్టుకు 'వుయ్యాల' కడితే, తప్పక సంతానవతులవుతారు అని నానుడి
(సేకరణ)
0 Comments