నిఘంటు కర్త శ్రీ జీవన్ కుమార్ lexicographer మరియు VSD ఇంగ్లీష్ తెలుగు dictionary సృష్టి కర్త మరియు దాని గురించి వివిధ టీవీ ఛానల్ కి https://www.youtube.com/watch?v=9atkJHysPo4 ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ఉనికిని తెలియచేస్తూ ఇంకా తన లోతైన పరిశోధనలో శంకర్ నారాయణ నిఘంటువు నుండి తాను తెలుసుకొన్న విషయాలు ను పలువురికి తెలియచేయాలని ఉద్దేశంతో మా డైలీ న్యూస్ ఛానల్ https://mohansanapala56.blogspot.com/ కి తెలియచేసిన బోగట్టా పై మా డైలీ న్యూస్ ప్రేక్షకులకు మీ చెంతకు తీసుకొస్తున్నాం .
Group సభ్యులొకరు కొద్ది రోజుల క్రితం ఉద్యోగాలకుపయోగపడే పుస్తకాలు అని చెప్పి శంకర్ నారాయణ నిఘంటువు ను సూచించారు. అసలు ఆ పుస్తకం ను వారే రాశారా లేక అతని దగ్గర ఉండే వారు ఎవరైనా రాసి శంకర్ నారాయణ పేరు వేసుకున్నారా అనేది సందేహమే. ఒకప్పుడు మనం విషయాన్ని cross check చేసుకునే స్థితి లో ఉండే వాళ్ళము కాదు. కానీ ఇప్పుడు మనకు అనేక మాధ్యమాలు అందు బాటులోకి వచ్చాయి. కాబట్టి ప్రతి విషయాన్నీ cross check చేసుకుని మనం ఒక నిర్ణయానికి రావాలి.
అసలు English శబ్దాలను తెలుగు లో రాయడం అనేది సరైన పద్దతి కాదు. ఉదాహరణకు ‘జూన్, జూమ్ & ప్లెజర్ ‘ అని తెలిపారు. కానీ ఈ మూడు పదాల్లో రాసిన ’ జ ‘ శబ్దం మూడు విధాలుగా ఉంటుంది. Sport, Spoken కు స్పో అంటూ long vowel వాడారు కానీ ఒక చోట long vowel ఇంకో దగ్గర gliding vowel ను వాడాలి. Muscle అనే పదాన్ని ‘మజిల్ ‘ గా పలకాలని రాసారు.
పదాలకు ఇచ్చిన అర్థాల విషయానికి వస్తే eye sore కు కండ్ల కలక అనే అర్థాన్ని ఇచ్చారు. అసలు eye sore అనేది వ్యాధే కాదు. rose apple అంటే నేరేడు పండు అని రాసారు. దారుణ మైన విషయం ఏమిటంటే Poop అంటే ఓడ వెనుక భాగం అని ఈ పుస్తకం లో ఉంది. దాని అర్థం – మలం.
ఇవి కనబడిన తప్పులు. అయితే ఈ తప్పులనే చాలా మంది అనుసరిస్తూ Dictionaries కూడా రాసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందచేసిన dictionary లో కూడా ఈ తప్పులు ఉన్నాయి. – నిఘంటు కర్త ; జీవన్ కుమార్ ; 8247829025.
0 Comments